ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నెస్ బర్గ్ లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో పలువురు దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సౌతాఫ్రికాకు వెళ్లారు. నిన్న సాయంత్రం ఆదేశంలో అడుగు పెట్టారు. మూడు రోజుల పాటు ఆయన జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
జోహన్నెస్ బర్గ్ లో ప్రధానికి ఘన స్వాగతం
ఇక జోహన్నెస్ బర్గ్ కు చేరుకున్న ప్రధాని మోడీకి దక్షిణాఫ్రికా ఘన స్వాగతం పలికింది. అక్కడి విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శన బృందం గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. సంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంటుంది.
PM @narendramodi arrived in Johannesburg, South Africa, a short while ago. He will participate in the G20 Summit and hold talks with several world leaders. pic.twitter.com/gf5SJjvB0a
— PMO India (@PMOIndia) November 21, 2025
ఈసారి జీ20 థీమ్ ఏంటంటే?
‘ఐక్యత, సమానత్వం, స్థిరత్వం’ అనే కాన్సెప్ట్ తో ఈసారి జీ20 సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచ సమస్యలను చర్చించడానికి ఈ శిఖరాగ్ర సదస్సు ఓ కీలక వేదికని దక్షిణాఫ్రికా వెళ్లే ముందు మోడీ తెలిపారు. “వసుదైవ కుటుంబకం, ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే మా దార్శనికతకు అనుగుణంగా భారత్ దృక్పథాన్ని సదస్సులో ప్రసంగిస్తా. ఆఫ్రికా గడ్డపై జరుగుతున్న తొలి జీ20 సదస్సు కాబట్టి ఇది చాలా ప్రత్యేకం అవుతుంది. ఈ సదస్సు సందర్భంగా జరగనున్న 6వ ఐబీఎస్ఏ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు, భాగస్వామ్య దేశాల నేతలతో చర్చించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నా” అని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
ఎన్నారైలతో సమావేశం
అటు దక్షిణాఫ్రికాకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడున్న భారతీయులను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వాళ్లు సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులో, సంగీత కచేరీ నిర్వహించారు. పలు రకాల సాంస్కృతి కార్యక్రమాలను ప్రదర్శించారు.
Deeply touched by the warm welcome from the Indian community in Johannesburg. This affection reflects the enduring bond between India and South Africa. These ties, rooted in history and strengthened by shared values, continue to grow even stronger! pic.twitter.com/1kUHKccXYG
— Narendra Modi (@narendramodi) November 21, 2025
India’s vibrant cultural diversity on display in South Africa!
Members of the Indian community took the lead in showcasing folk dances from 11 states of India during a short cultural programme aptly titled ‘Rhythms of a United India.’ It is commendable how the Indian community… pic.twitter.com/QdTXwRipip
— Narendra Modi (@narendramodi) November 21, 2025





