
Shubhanshu Shukla Meets PM Modi: అంఅంతరిక్ష యాత్రను ముంగిచుకుని భారత్ కు వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. శుభాంశును మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ అంతరక్షి యాత్రకు సంబంధించిన విశేషాలను ప్రధానితో ఆయన పంచుకున్నారు. యాత్ర విజయవంతం కావడంపై ప్రధాని శుభాంశును అభినందించారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు తన బృందంతో జూన్ 25 నుంచి జూలై 15 వరకూ ఐఎస్ఎస్ యాత్ర కొనసాగించారు. ఐఎస్ఎస్‌కు పర్యటించిన తొలి భారతీయ వ్యోమగామిగా ఆయన గుర్తింపు పొందారు. 18 రోజుల మిషన్ పూర్తి చేసుకుని జూలై 15న ఆయన తిరిగి భూమిపై కాలుపెట్టారు. ఆదివారం ఢిల్లీకి వచ్చారు. ఎయిర్‌పోర్ట్ లో శుభాంశు కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వి.నారాయణ, పెద్ద సంఖ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు.
శుభాంశుపై లోక్ సభ ప్రశంసలు
అటు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన శుభాన్షు శుక్లా గౌరవార్ధం లోక్ సభలో ప్రత్యేక చర్చను చేపట్టారు. శుక్లా ఘనతపై లోక్‌సభలో చర్చ జరిగింది. దేశంలోని ప్రతి బిడ్డకు శుభాంశు శుక్లా స్ఫూర్తిగా మారారని, ఆయనలా ఎదగాలని, అంతరిక్ష యాత్రలు చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శుభాంశుపై చర్చను బహిష్కరిస్తూ విపక్ష సభ్యులు సభ నుంచి వెళ్లిపోయిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇది అత్యంత దురదృష్టకరమని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. శుక్లాపై ప్రత్యేక చర్చలో విపక్షం పాల్గొనబోదని, తనకు ముందే తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. అంతరిక్ష హీరో, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రశంసించకుండా ఉండలేనన్నారు. శుక్లా పర్యటన విజయవంతం కావడాన్ని స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఇది భారతదేశంలోని ప్రతి పౌరునికి, ముఖ్యంగా యువకులకు స్ఫూరిదాయకమన్నారు.