అంతర్జాతీయం

చైనాకు ప్రధాని మోడీ.. గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి!

PM Modi China Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగష్టులో చైనాకు వెళ్లనున్నారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. 2020లో తూర్పు లద్దాఖ్‌ లోని గాల్వాన్ లోయలో సైనికుల మధ్య ఘర్షణతో చైనా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయ. ఆ ఘటన తర్వాత తొలిసారి మోడీ చైనాకు వెళ్తున్నారు. అయితే, ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నారు.

తియాంజిన్ వేదికగా శిఖరాగ్ర సమావేశాలు

చైనాలోని తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ఈ సమావేశాలను నిర్వహిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు ఎస్‌సీఏ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

చైనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక మోడీ చర్చలు

ఇక చైనా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు దేశాధినేతలు చివరిసారిగా 2024 అక్టోబర్‌ లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలిశారు. మోడీ  పర్యటనకు ముందుగా చైనాలో భారత విదేశాంగ మంత్రి జైంశర్ పర్యటించారు. ఎస్‌సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తోనూ సమావేశం అయ్యారు. గత ఐదేళ్లలో జైశంకర్ చైనాలో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Read Also: భారత రక్షణ వ్యవస్థ.. సీడీఎస్ అనిల్ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button