
PM Modi London Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు దేశాల పర్యాటనకు భాగంగా.. రెండు దేశాల పర్యటనలో భాగంగా లండన్ కు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వ పెద్దలు, ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు భారతీయ జెండాలు పట్టుకుని భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు
రెండు రోజుల పర్యటనలో భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మోదీ ఇవాళ సమావేశం కానున్నారు. ఆర్థిక సహకారం, ఉద్యోగ కల్పనపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా కీలక పోస్టు పెట్టారు. “లండన్ కు చేరుకున్నాను. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుంది. సంపద, వృద్ధి, ఉద్యోగ సృష్టిపై చర్చలు జరుపుతాం. భారత్-యూకే స్నేహం ప్రపంచ ప్రగతికి అత్యవసరం” అని రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, విద్య, పరిశోధన, సుస్థిరత, ఆరోగ్యం, ప్రజల మధ్య సంబంధాలు వంటి విభాగాల్లో చర్చలు జరగనున్నాయి. ఈ రంగాలన్నీ కలిసి రెండు దేశాల సహకారాన్ని మరింత బలపరుస్తాయని ఇరుదేశాధినేతలు భావిస్తున్నారు. అటు భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు కీలక దశలో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య దిగుమతి, ఎగుమతులపై సుంకాలను తగ్గించడం లేదంటే పూర్తిగా తొలగించనున్నారు. దీనివల్ల రెండు దేశాల వస్తువులు మరింత పోటీ తత్వాన్ని సాధిస్తాయి. అదే సమయంలో యూకే వ్యాపారాలకు భారత్ లో పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుంది. అటు కింగ్ ఛార్లెస్ తోనూ ప్రధాని సమావేశం కానున్నారు.
యూకే పర్యటన తర్వాత మాల్దీవులకు
అటు యూకే పర్యటన తర్వాత ప్రధాని మోడీ మాల్దీవులకు వెళ్తారు. ఈ రెండు దేశాల పర్యటన దౌత్య సంబంధాలను, ఆర్థిక లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ పర్యటన భారత్ ప్రపంచ ఆర్థిక, రాజకీయ వేదికపై ప్రభావాన్ని మరింత పెంచనుందని ప్రధాని మోడీ తెలిపారు.
Read Also: అత్తింటి వేధింపులు అబద్దమేనా? మహిళా ఐపీఎస్ పై సుప్రీ ఆగ్రహం!