
Shubhanshu Shukla Return:సుమారు 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేసి, తాజాగా భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా టీమ్ ను ప్రధాని మోడీ అభినందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టిన తొలి భారతీయ వ్యోమగామి శుక్లా అని చెప్పుకొచ్చారు. కోట్లాది మంది భారతీయులకు ఆయన అంకితభావం, ధైర్యం, స్ఫూర్తి ప్రేరణ అందిస్తుందన్నారు. గగన్ యాన్ యాత్రకు శుభాన్షు టూర్ ఓ మైల్ స్టోన్ గా నిలుస్తుందన్నారు. ఈ మేరకు తీన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు పెట్టారు.
జూన్ 25న శుభాన్షు అంతరిక్షయానం
జూన్ 25న శుభాన్షు శుక్లా.. పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ యుజాన్‌స్కీ విష్నేవ్ స్కీ,టైబోర్ కపుతో కలిసి యాక్సియం-4 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరారు. అమెరికాలోని ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్ లోని లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12. 01 గంటలకు యాక్సియం 4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరింది. సుమారు 18 రోజుల అనంతరం కాలిఫోర్నియాలో శాన్ డియాగో తీరంలో డ్రాగన్ అంతరిక్ష నౌక భారత కాలమానం ప్రకారం( జూలై 3) మధ్యాహ్నం 3.00 గంటలకు దిగింది. శుభాన్షు టీమ్ సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ యాత్రలో భాగంగా శుభాన్లు అంతరిక్ష కేంద్రంలో పలు పరిశోధనలు చేశారు. ముఖ్యంగా జీరో గ్రావిటిలో పంటల సాగును పరీక్షించారు. తాజాగా ఈ పరిశోధన ఫలితాలపై విశ్లేషణలు జరపనున్నారు.
Read Also: భూమికి తిరిగొచ్చిన ఇస్రో వ్యోమగామి శుభాన్షు శుక్లా తొలి వ్యాఖ్యలు