
PM Kisan Yojana Money Delay: దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పదకానికి సంబంధించిన 20వ విడత డబ్బులు ఎప్పుడు తమ ఖాతాల్లో జమ అవుతాయా అని పడిగాపులు కాస్తున్నారు. జులై 18 నాటికి ఈ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వార్తలు వచ్చాయి. కానీ, ఇంకా ఆ డబ్బు చేరలేదు రైతులకు చేరలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ డబ్బులు వస్తాయా? లేదా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కచ్చితంగా వస్తాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు విడుదల చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే?
నిజానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు ఈ నెల 18నే వస్తాయని అందరూ ఊహించారు. బీహార్‌లోని మోతిహారిలో ప్రధాని మోడీ ఓ బహిరంగ సభలో 20వ విడత నిధులు విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు కూడా జమ కాలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం లేనప్పటికీ, ఈ నెల చివరలో లేదంటే ఆగస్టు మొదటి వారంలో 20వ విడుదల డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. డబ్బులు ఆలస్యంగా పడటానికి కారణం, రైతుల డేటాను సరిచూస్తున్నట్లు తెలుస్తోంది. డేటా అంతా పక్కాగా ఉండేలా చూసుకుని, డబ్బులు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారట. అర్హులైన ఏ రైతుకు డబ్బులు అందకుండా ఉండకూడదనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లలోకి పీఎం డబ్బులు పడేలా ఏర్పాట్లు చేస్తున్నారట.
Read Also: మరో నాలుగు రోజులు.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు!