క్రైమ్ మిర్రర్ : ప్రో కబడ్డీ సీజన్ 11 లో భాగంగా నిన్న రాత్రి జరిగినటువంటి హర్యానా మరియు పట్న పైరేట్స్ ఫైనల్ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ ఘనవిజయాన్ని సాధించింది. హర్యానా 33, పట్న పైరేట్స్ 23 తేడాతో హర్యానా స్టీలర్స్ 11 పాయింట్లతో విజయాన్ని సాధించి టైటిల్ గెలిచింది. మొట్టమొదటిసారిగా కబడ్డీ సీజన్ లో హర్యానా స్టీలర్స్ కప్పు గెలిచింది. దీంతో హర్యానా టీం మరియు ఫ్యాన్స్ ఆనందోత్సవంలో మునిగిపోయారు.
Read Also : తెలంగాణ పోలీస్ కొత్త లోగో.. విడుదల చేసిన తెలంగాణ పోలీసులు
హర్యానా స్టీలర్స్ టీం లో శివం పటారే ఆల్రౌండర్ ప్రదర్శనతో అందరిని కూడా ఆకట్టుకున్నాడు. మహమ్మద్ రిజా షాధులు మరియు రైడర్ నవీన్, డిపెండర్ రాహుల్ సేతు పాల్ మరియు జైదీప్ అందరూ కూడా మంచి ప్రదర్శన కనబరచి టైటిల్ను సొంతం చేసుకున్నారు. దీంతో సునాయసంగా 11 పాయింట్లు తేడాతో పట్న పైరేట్స్ పై హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది.
Also Read : రైతు భరోసా ఇప్పట్లో లేనట్లే! మళ్లీ ఆన్ లైన్ అప్లికేషన్స్ అట..
ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిన 20 నిమిషాల వరకు ప్రతిక్షణం ఉత్కంఠంగా సాగిన చివరిలో హర్యానా స్టీలర్స్ ముందుకు దూసుకెళ్లింది. హర్యానా స్టీలర్స్ కోచ్ మనప్రీత్ సింగ్ కూడా విజయం తర్వాత భావోద్వేగానికి లోనయ్యాడు. ఐదు సంవత్సరాలుగా వేచి చూస్తున్నా కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందంటూ హర్యాన కోచ్ మన్ప్రీత్ సింగ్ కు కూడా చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- మన్మోహన్ కు భారతరత్న ఇవ్వడంపై పూర్తిగా మద్దతు తెలుపుతాం: కేటీఆర్
- తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!
- పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి
- ప్రీమియర్ షోస్ కోసం CM ను అడుక్కోవడం కరెక్ట్ కాదు: నిర్మాత