![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-46.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కెసిఆర్ వారసురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు పెట్టి, అరాచకాలకు పాల్పడతారో వారిని వదిలేది లేదని కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్నా అరాచకాలన్నిటిని కూడా పింక్ బుక్ లో ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు తేల్చుతామని… ఎవరిని కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా మా బి ఆర్ ఎస్ కార్యకర్తలపై కేసులు బనాయిస్తుందని అన్నారు. సోషల్ మీడియా విమర్శకులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకతను చూపెట్టే పోస్టులు పెట్టిన కొద్ది క్షణాల్లోనే పోలీసులు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని అన్నారు. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ బుక్ లో రాసుకున్నటువంటి అన్నిటిని కూడా బయటకు తీసి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని అన్నారు.
తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించేది ఎప్పుడు ?..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ కూడా యువగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రెడ్ బుక్ ఒకటి తయారుచేసి అందులో ప్రతిపక్ష నేతలు ఏవరైతే కుట్రలు చేశారో, ఎవరైతే కార్యకర్తలను వేధించారో వాళ్ళందరి పేర్లు కూడా ఆ బుక్ లో నమోదు చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్ట బోమని నారా లోకేష్ తెలిపిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే తరహాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా చెప్పడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులలో కొంత భయం ఏర్పడుతుంది.