క్రైమ్

స్నానం కోసం గోదావరిలో దిగి.. ఐదుగురు యువకులు మృతి!

Basara Tragedy Incident: విహారయాత్ర విషాదయాత్రగా మారింది. స్నానం కోసం గోదావరి నదిలోకి దిగిన ఐదుగురు యువకులు.. నీటి ప్రవాహంలో ముగిని చనిపోయారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాసర దగ్గర గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు చనిపోయారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

బాసర సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు.. హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతానికి చెందిన 18 బాసరకు వచ్చారు. ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో స్నానం చేయడానికి గోదావరి నది దగ్గరికి వెళ్లారు. వీరిలో పలువురు యువకులు నదిలోకి దిగారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఐదుగురు యువకులు మునిగిపోయారు. మిగతా వాళ్లు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మొత్తం ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

రంగలోకి దిగిన గజ ఈతగాళ్లు

యువకులు నీళ్లలో మునిగిన విషయాన్ని గమనించిన స్థానికి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రాకేష్, వినోద్, మదన్, రితిక్‌ గా గుర్తించగా, మరో యువకుడు భరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యువకుల మృతి విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పారు.

Read Also: బ్రిడ్జి కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు!

Back to top button