తెలంగాణ

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఫార్మాసిటీ రైతుల ఝలక్‌

  • ఎమ్మెల్యే రంగారెడ్డి ఇంటి ఎదుట ధర్నాకు దిగిన రైతులు

  • ఇచ్చిన మాట ప్రకారం భూములు ఇప్పించాలని డిమాండ్‌

  • ఫార్మాసిటీ రద్దు పేరుతో మాయమాటలు చెప్పారని ఆరోపణ

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఫార్మాసిటీ రైతులు ఝలక్‌ ఇచ్చారు. ఏకంగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే రంగారెడ్డికి ఇంటి ముందు ధర్నాకు దిగారు. కాంగ్రెస్‌ సర్కార్‌ రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, మీ భూములు మీకు ఇప్పిస్తామని ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఫార్మాసిటీని రద్దు చేసి, భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాచారం మండలం నానక్‌నగర్‌, తాటిపర్తి, కుర్మిద్ద, మేడిపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఫార్మా వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రైతులకు సమాధానం చెప్పలేక ఇంట్లో నుంచి ఎమ్మెల్యే బయటకు రావడం లేదని ఆరోపించారు. ఉదయం 8గంటల నుంచి బయట వేచి చూస్తున్నా సమయం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎండలోనూ ఫార్మా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

తిరుమల హిల్స్‌లోని ఎమ్మెల్యే రంగారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు తరలివస్తున్నారు. ఫార్మా రైతుల ఆందోళన నేపథ్యంలో అరెస్టులకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: 

  1. ఇకపై మూవీ పైరసీ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష!..
  2. వరుస దొంగతనాలు… ఒంగోలు ప్రజల గుండెల్లో భయం!

 

Back to top button