
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటుగా మామూలు గ్రామాలు కూడా నీట మునిగాయి. బతుకు తెరువు కోసం బయటకు వెళ్లడానికి కూడా వర్షం అడ్డం రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కూలీలు కూడా ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తుంది. మరోవైపు బస్టాండ్స్ అలాగే రైల్వే స్టేషన్స్ లో భారీగా నీరు చేరడంతో రాకపోకలకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామందికి సరిగా ఆహారం కూడా దొరకడం లేదు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతుండడంతో అనారోగ్యంకి కూడా గురవుతున్నారు. కాబట్టి ఈ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పాటించాలి అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read also : ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్!
వర్షంలో ఎక్కువగా తడవకుండా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా విష జ్వరాలు రాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఒకవేళ వర్షం ద్వారా జ్వరాలు వస్తున్నట్లయితే కాచి చల్లార్చిన నీటిని తాగాలి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చిన్నపిల్లలను చెట్లు కిందకు, కరెంటు స్తంభాల వద్దకు వెళ్ళనివ్వకుండా తల్లిదండ్రులే చూసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక నీరు ఎక్కువగా నిలిచిన ప్రాంతాల్లో వాహనాలను నడపడం ప్రమాదకరమని గుర్తు చేశారు. ఇంట్లోకి ఎక్కువగా నీరు వచ్చినప్పుడు వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి అని సూచించారు. ఇంకా ఈ వర్షాలు మరో వారం రోజులు పాటు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని… అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలు భారీ వర్షాల నేపద్యంలో స్కూల్స్ కి సెలవులు ఇవ్వడం కూడా జరిగింది.
Read also : మైనర్ బాలికపై లైంగికదాడి..10 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్ట్!