
క్రైమ్ మిర్రర్,కేశంపేట:- మండలంలో వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు.గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కారణంగా పాత ఇండ్లల్లో నివాసముంటున్న వాళ్లు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.కరెంటు స్తంభాలకు,వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ శాఖ అధికారులు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అన్ని జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని సూచించారు. కరెంట్ స్తంభాలు అలాగే పెద్ద పెద్ద చెట్ల కింద ఉండకూడదని సూచించారు.