
క్రైమ్ మిర్రర్, బిగ్ న్యూస్ :- జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో యావత్ భారతదేశమంతా అలర్ట్ అయింది. పహల్ గాం లో జరిగిన దాడిలో 30 మంది అమాయక ప్రాణాలు బలైపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తము ఉందని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఒకవైపు భారత ప్రభుత్వం ఉగ్రవాదులను వేరువేసే పనిలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలోనే మరోసారి ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉండడంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా రద్దీ ఉండే 13 ప్రదేశాలను హై- అలర్ట్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. ఈ 13 ప్రదేశాలలో కూడా తదుపరి నోటీసు వచ్చేవరకు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రదేశాలలో మెరుగైన భద్రత చర్యలను నిర్ధారించడానికి ఈ రాత్రికి నాటికి ప్రత్యేక ఆక్టోపస్ ( కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఆర్గనైజేషన్) బృందాలు ఈ ప్రాంతాలలో భద్రత కల్పించనున్నారు. మరి ఆ 13 ప్రదేశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ – హైదరాబాద్
2. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం- హైదరాబాద్
3. కూకట్ పల్లి – హైదరాబాద్
4. రైల్వే స్టేషన్ – విజయవాడ
5. తిరుమల ఆలయం, అలిపిరి ప్రదేశం – తిరుపతి
6. రామకృష్ణ బీచ్ – విశాఖపట్నం
7. ట్యాంక్ బండ్ – హైదరాబాద్
8. జగదాంబ జంక్షన్ – విశాఖపట్నం
9. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ – విజయవాడ
10. ఎంజీ రోడ్డు – విజయవాడ
11. నాంపల్లి – హైదరాబాద్
12. రైల్వే స్టేషన్ – విశాఖపట్నం.
13. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ – హైదరాబాద్
ఈ 13 ప్రదేశాల్లోని ప్రజలు అవసరము లేదా అత్యవసరమైతే తప్ప ఈ ప్రాంతాలలో ఎక్కువ సమయం ఉండకూడదని అధికారులు సూచించారు. ఈ ప్రదేశాలకు ప్రయాణించడం తప్పనిసరి అయితే.. అప్రమత్తంగా ఉంటూనే ఎవరైనా అనుమానాదాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని అధికారులు తెలిపారు.