Tuesday, March 24, 2026
Homeతెలంగాణగ్యాస్ కొర‌త‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు....గ‌న్ పార్కు వ‌ద్ద బీఆర్ ఎస్ శ్రేణుల నిర‌స‌న‌

గ్యాస్ కొర‌త‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు….గ‌న్ పార్కు వ‌ద్ద బీఆర్ ఎస్ శ్రేణుల నిర‌స‌న‌

  • కేంద్రం చెప్పేవ‌న్ని అబద్దాలే…
  • బ‌లై పోతున్న స‌మాన్య‌ ప్ర‌జ‌లు
  • వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్‌

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ః  ప‌శ్చిమాసియాలో యుద్ద ప్ర‌భావంతో ఎల్‌పీజీ గ్యాస్ కొర‌త‌తో రాష్ర్టంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం గ్యాస్ స‌లిండ‌ర్ల కొర‌త‌ను నిర‌సిస్తూ గ‌న్ పార్కు వ‌ద్ద బీఆర్ ఎస్ శ్రేణులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు .

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం చెప్పేవ‌ని అబద్దాలేన‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మిస్తోంద‌ని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో గ్యాస్ తీవ్రంగా ఉంద‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలోనే పెట్రోలియం ఉంద‌ని తాము ఏమి చేయ‌లేద‌ని రాష్ర్ట ప్ర‌భుత్వం చెబుతుంద‌ని ఆవేద‌న చెందారు.

భ‌విష్య‌త్‌లో సిలిండ‌ర్ సైజును 10 కిలోల‌కు తగ్గిస్తామంటు కేంద్ర రాష్ర్ట ప్ర‌భుత్వాలు సామాన్య ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయంటూ ఆవేద‌న చెందారు. యుద్దం కార‌ణంతో గ్యాస్ కొర‌త తీవ్రంగా ఉంద‌ని, కొర‌త‌లేద‌ని కేంద్రం చెబుతుంటే స‌ర‌ఫ‌రా లేద‌ని రాష్ర్ట ప్ర‌బుత్వం చెబుతుంద‌ని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. గ్యాస్ కొరత పై ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రకటన చేయాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments