తెలంగాణ

రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన రైతులు...లగచర్లలో ఉద్రిక్తత.!

క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దుద్యాల మండలం లగచర్లకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగలడంతో పాటు గ్రామస్తులు దాడి చేశారు.లగచర్లలో సోమవారం ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ జరిగింది. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ప్రజలతో చర్చించేందుకు కలెక్టర్‌ సహా అధికారులు వచ్చారు. అయితే ఫార్మా కంపెనీకి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ మహిళ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగినట్లు సమాచారం.ఆపై గ్రామస్తులు పట్టరాని కోపంతో అధికారుల వాహనాలపై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ వెంటనే అధికారులంతా అక్కడి నుంచి వెళ్లేపోయే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లగచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా..భారీగా పోలీసులు మోహరించారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button