అంతర్జాతీయం

ఆగిన కాల్పులు!… గాజాలో ప్రశాంత వాతావరణం?

బాంబింగ్‌, షెల్లింగ్‌ వైమానిక దాడులతో నామరూపాలు కోల్పోయిన గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంతో ఆదివారం ప్రశాంతత నెలకొంది. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి తర్వాత మొదలైన యుద్ధం ఆదివారానికి 470వ రోజుకు చేరుకుంది. గత ఏడాది కూడా హమా్‌స-ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందం అమలవ్వగా.. బందీల విడుదలలో ఆలస్యం, పేర్లను వెల్లడించకపోవడం వంటి కారణాలతో యుద్ధం కొనసాగుతూ వచ్చింది. తాజాగా అమెరికా, ఖతార్‌, ఈజిప్ట్‌ నెరపిన మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మరోమారు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దశల వారీగా 33 మంది బందీలను విడుదల చేయడానికి హమాస్‌.. అందుకు ప్రతిగా తమ దేశ జైళ్లలో ఉన్న 737 మంది పాలస్తీనీయులను విడిచిపెట్టడానికి ఇజ్రాయెల్‌ అంగీకరించాయి.

14 ఏళ్ల బాలుడి హత్య కేసును 24 గంటల్లోనే చేదించిన పోలీసులు!..

హమాస్‌ దాడులతో సంబంధం లేని 1,167 మంది గాజా పౌరులకూ స్వేచ్ఛ లభించనుంది. మరోవైపు, ఒప్పందం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 నుంచి కాల్పుల విరమణను పాటించాలి. అప్పటి వరకూ గాజాపై దాడిని కొనసాగించిన ఇజ్రాయెల్‌.. తొలి విడతగా విడుదలవ్వనున్న ముగ్గురు బందీల జాబితా రాలేదనే సాకుతో ఉధృతిని పెంచింది. ఉదయం 11.15 గంటల వరకు హమాస్‌ వర్గాలు బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీ యువతుల పేర్ల(రోమి గోనెన్‌, ఎమిలి దమారి, డోరాన్‌ స్టెయిన్‌బెర్‌)ను విడుదల చేసే వరకు కూడా కాల్పులు కొనసాగాయి. ఖాన్‌యూని్‌సపై జరిపిన ఈ దాడుల్లో 26 మంది చనిపోయారు. సాయంత్రానికి హమాస్‌ వర్గాలు ముగ్గురు బందీలను రెడ్‌క్రా్‌సకు అప్పగించాయి. కాగా, ఒప్పందం మేరకు బందీలను విడుదల చేయకుంటే గాజాలో మళ్లీ యుద్ధం తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.

ప్రపంచ పెద్దన్న ప్రమాణస్వీకారం!.. అందరిలోనూ టెన్షన్.. టెన్షన్?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button