విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ కేవలం సంఖ్య కాదని.. ఇది వేలాది కుటుంబాలకు కొత్త ఆశ… అని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు మంత్రి కుమారస్వామికి శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను రీపోస్టు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ అందించాలన్న ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి ఏపీ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు సారథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం మనుగడ సాగించడమే కాకుండా అభివృద్ధి చెందుతుందని హామీ ఇస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి
1.రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం!… హామీలన్నీ గాలికి వదిలేసాడు?
2.అన్ని హామీలు నెరవేరుస్తాము!… కేటీఆర్ స్కాములు కూడా బయటికి తీస్తాం?