
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు ఎంత రేంజ్ ఫాలోయింగ్ ఉందో… తమిళనాడులో కూడా దాదాపుగా దళపతి విజయ్ కు సేమ్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా విజయ్ ప్రకటించారు.
ట్రంప్ గోల్డ్ కార్డుకు ఫుల్ డిమాండ్.. ఒక్క కార్డు 40 కోట్లు
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తొలిసారిగా దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రీ కళగం పార్టీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ తమిళ మీడియా ఛానల్ కు పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగానే యాంకర్ అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానాలు ఇస్తున్నారు. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు మీరు దళపతి విజయ్ పార్టీ గురించి ఎప్పుడైనా గమనించారా?.. అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ కీలక సమాధానం చెప్పారు. దళపతి విజయ్ పార్టీ గురించి నేను ప్రత్యేకంగా దృష్టి అనేది పెట్టలేదు.. ఆయన పార్టీ గురించి వాళ్లు, వీళ్లు మాట్లాడుకుంటుంటే చాలాసార్లు విన్నాను అని అన్నారు. విజయ్ అంటే నాకు చాలా గౌరవం.. రాజకీయాల్లో ప్రయాణం కొనసాగించాలంటే చాలా కఠినంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. విజయ్ నేను ఒకే ఒక్కసారి కలిసాం అని అన్నారు. అయితే ఓ యాంకర్ ఇదే సందర్భంలో మీరు.. మీ పార్టీని తమిళనాడుకు విస్తరించే అవకాశం ఉందా అని అడగగా పవన్ కళ్యాణ్ ఏది ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది… తమిళ ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీని విస్తరిస్తాను.. అందులో ఎవరికి ఎటువంటి అవమానం అవసరం లేదని చెప్పుకొచ్చారు.
గాలివాన బీభత్సం.. ప్రధాన రహదారుల పై విరిగిపడ్డ చెట్లు.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు…!