Pawan Kalyan: ఇప్పటిలా సోషల్ మీడియా లేకపోయిన రోజుల్లో హీరోల స్టైల్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఎవరి సినిమా రిలీజ్ అయినా, వారు వేసుకున్న డ్రెస్‌లు, హెయిర్ స్టైల్, గెటప్ గురించి రోజులు తరబడి మాట్లాడుకునేవారు. అలాంటి చర్చలకు కారణమైన వాటిలో ఒకటి గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కల్యాణ్ వేసిన స్పెషల్ ప్యాంట్. ఆ ప్యాంట్ అప్పట్లో నిజంగానే సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆ ప్యాంట్ ధర సుమారు రూ.1.40 లక్షలు అని ప్రచారం రావడంతో యూత్‌లో మరింత హైప్ ఏర్పడింది. “లక్ష రూపాయల ప్యాంట్‌రా!” అంటూ అభిమానులు గర్వంగా చెప్పుకునేవారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ కాస్ట్యూమ్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ఇదే తరహాలో బాలు సినిమా సమయంలో కూడా ఆయన డిఫరెంట్ స్టైల్‌ను ట్రై చేశారు. అప్పట్లో హీరో కాస్ట్యూమ్ ఖర్చు ఇంతగా చర్చకు రావడం అరుదు కావడంతో ఈ విషయం పెద్ద టాపిక్ అయింది.
ఆ స్పెషల్ ప్యాంట్ ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ దగ్గర ఉందని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. అంతేకాదు ఆయన నటించిన రేయ్ సినిమాలో కూడా ఆ ప్యాంట్ ఉపయోగించారనే వార్తలు వినిపించాయి. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన కాస్ట్యూమ్ మరో తరం హీరో వద్ద ఉండటం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
గుడుంబా శంకర్ సినిమాకు వీర శంకర్ దర్శకత్వం వహించగా, అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగేంద్ర బాబు నిర్మించారు. హీరోయిన్‌గా మీరా జాస్మిన్ నటించింది. సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా, పవన్ అభిమానులకు మాత్రం కల్ట్ మూవీగా మారింది. ముఖ్యంగా మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, మరోవైపు సినిమాల్లో కూడా కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన OG మంచి వసూళ్లు సాధించగా, ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఒక ప్యాంట్‌తోనే అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన పవన్ స్టైల్ ఇప్పటికీ అభిమానుల్లో క్రేజ్ కొనసాగిస్తూనే ఉంది.
ALSO READ: Telangana: నేడు ‘హెల్త్ మిషన్ – 100’ ప్రారంభం.. అసలేం చేస్తారు?
