
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీకి మంగళవారం సెలవు. మహాశివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా బుధ. గురువారాలు సెలవే. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. సోమవారం అంటే మార్చి 2 నుంచి బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే గతంలో అసెంబ్లీకి రానని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూట్ మార్చారు. బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఈసారి ఏపీ అసెంబ్లీ రచ్చరచ్చగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేశారు.వైసీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా, జనసేన సభ్యులు సంయమనం కోల్పోవద్దని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. హుందాగా వ్యవహరించాలన్నారు. YCP సభ్యుల ట్రాప్‌లో పడొద్దని పిలుపునిచ్చారు. గతంలో చట్టసభల్లో వాళ్ల భాష, విధానం ప్రజలంతా గమనించారన్నారు పవన్ కల్యాణ్. జనసేన సభ్యులకు పలు సూచనలు చేశారు పవన్ కల్యాణ్. YCP ప్రతినిధుల దిగజారుడు వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దన్నారు.
చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని జనసేనాని సూచించారు. ముఖ్యంగా అభ్యంతరకర పదజాలం వాడొద్దుని గట్టిగా చెప్పారు. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన పదాలే వినియోగించాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడేది ప్రజలంతా గమనిస్తున్నారని గుర్తించుకోవాలన్నారు. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనేదానిపై నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్ సభ్యులకు గైడ్ చేయాలని సూచించారు. ప్రజా సమస్యలు, ఆకాంక్షలు, ఆశలను చట్టసభల్లో వినిపించేలా జనసేన పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. చర్చల్లో పాల్గొనాలని సూచించారు. సామాన్యుడి గొంతుగా నిలవాలన్నారు. సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుని చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రయోజన అంశాల్ని జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాల్లో లేవనెత్తాలని , ఇతర అంశాలపై జరిగే చర్చల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. సందేహాలుంటే సీనియర్ల సలహాలు తీసుకోవాలని సేచించారు. జనసేన సభ్యులంతా బడ్జెట్‌ను అధ్యయనం చేయాలన్నారు పవన్ కల్యాణ్.
ఇవి కూడా చదవండి..
-
రంగములోకి దిగిన రాట్ హోల్ మైనర్స్… ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్
-
50 గంటలైనా కనిపించని జాడ.. 8 మంది కార్మికులు టన్నెల్ సమాధే?
-
రోజులు గడుస్తున్నాయ్…ఆశలు సన్నగిల్లుతున్నాయ్…ఆ 8మంది జాడేది..?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్