ఆంధ్ర ప్రదేశ్

మార్కాపురం జిల్లా, వెలిగొండ ప్రాజెక్టుపై… స్పష్టత ఇవ్వని పవన్ కళ్యాణ్..!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏమేమి మాట్లాడుతారు అని చాలామంది కూడా ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్కాపురం ఎప్పుడు జిల్లా అవుతుందని?.. వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? అని జిల్లా ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ఉన్నారు.

మార్కాపురం జిల్లాగా!.. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి!..
ఇవి ఎప్పుడు జరిగేనో?.. ప్రజల కళ నెరవేరేనా?

అవును మీరు విన్నది నిజమే. ఎన్నో ఏళ్లుగా ప్రకాశం జిల్లా ప్రజలకు మార్కాపురం జిల్లా మరియు వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తవడమే కలగా మార్చుకున్నారు. ఇవి రెండు జరుగుతే.. ప్రకాశం జిల్లా ప్రజల కల నెరవేరినట్టేనని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవి రెండు పూర్తి చేస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా పనులు మాత్రం పూర్తి కాలేదు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రెండింటిని కూడా పూర్తి చేస్తామని మాట ఇచ్చింది. ఇది పూర్తవుతుందో లేదో తెలియదు కానీ… నేడు జలజీవన్ మిషన్ పనుల కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురానికి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎన్నో రకాలుగా సంభాషించారు. ప్రకాశం జిల్లాలో డబ్బు చాలా ఎక్కువగా ఉందని అన్నారు. గత ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలు కలిపి 2000 కోట్లు ఖర్చుపెట్టారని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటిది గెలవడానికి అన్ని కోట్లు ఖర్చుపెట్టిన వారు వెలుగొండ పూర్తి చేయడానికి ఎనిమిది వందల కోట్లు తీసుకురాలేకపోయారు అని అన్నారు. మీరు డబ్బు గెలవండి.. నాకేం ఇబ్బంది లేదు. ఎలాగైనా ప్రజల దాహం తీర్చండి అని పవన్ కళ్యాణ్ కోరారు. అలాగే ఫ్లోరైడ్ సమస్య కారణంగానే కేవలం ఆరు నెలలకి కనిగిరి వదిలి వెళ్ళిపోయామని పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఫ్లోరైడ్ సమస్య తీరలేదు. ఎక్కడ యువత అలాగే ప్రజల ఆవేదన నాకు తెలుసు కాబట్టి జలజీవన మిషన్ పనులు ఇక్కడి నుంచే ప్రారంభించాను అని చెప్పుకొచ్చారు. అలాగే 1290 కోట్లతో ప్రకాశం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చారని పవన్ కళ్యాణ్ ను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మెచ్చుకున్నారు.

బాలినేని శ్రీనివాస్ రెడ్డిని అందుకే పార్టీలోకి చేర్చుకున్న : డిప్యూటీ సీఎం పవన్

అర్ధరాత్రి కొండమల్లెపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్పీ ఆకస్మిక తనిఖీ!.. సిబ్బందికి హెచ్చరికలు, ప్రజలకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button