
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మిస్టరీ వీడింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రిలో అనుమానాస్పదంగా చనిపోయారు. రాజమండ్రి దివాన్ చెరువు సమీపంలో రోడ్డు పక్కన ఆయన డెడ్ బాడీని గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ముందు భావించారు. కాని ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. బుల్లెట్ బైక్ పై వస్తున్న ప్రవీణ్.. ఎవరో వెనుక నుంచి ఢీకొట్టి హత్య చేశారని ఆయన అనుచరులు ఆరోపించారు. శరీరంపై గాయాలు చూపిస్తూ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పాస్టర్ ప్రవీణ్ మృతి రాజమండ్రిలో కలకలం రేపింది. క్రైస్తవులు, ప్రవీణ్ అనుచరులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.దీంతో ప్రవీణ్ ప్రమాదం కేసును పోలీసులు లోతుగా విచారించారు. అసలేం జరిగిందో తేల్చారు. పాస్టర్ బుల్లెట్ వాహనం పై వేగంగా వస్తున్న సమయంలో రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు వద్ద రోడ్డుపై అదుపుతప్పి పడిపోయినట్లు పోలీసులు తేల్చారు. ఆయన స్పాట్‌లోనే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఘటనాస్థలికి వరకూ మొత్తం సీసీ ఫుటేజీని పరిశీలించి మృతి మిస్టరీని తేల్చేశారు.అక్కడి సీసీ కెమేరా విజువల్స్‌ను పోలీసులు విడుదలచేశారు.
Also Read : కరాటే మాస్టర్ చివరి కోరిక.. పవన్ కళ్యాణ్ తీరుస్తాడా?
పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు భావించారు. కానీ ఆయన శరీరంపై గాయాలున్నాయి. దీంతో ఆయన అనుచరులు ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి, దాడి చేసి ఉంటారని ప్రవీణ్ సన్నిహితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ మరణంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
-
టెన్త్ పరీక్షా పేపర్ లీక్.. సైలెంట్ గా ఉండాలని డీఈవోకు వార్నింగ్
-
కదలుతున్న రైలులో అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్
-
ఐదుగురు నన్ను లైంగికంగా వేధించారు- కన్నీరుపెట్టుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్
-
బిర్యానీ సెంటర్ లో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా బయటపడ్డ వస్తువులు!
-
లేడీ అఘోరీతో బీటెక్ యువతి జంప్… కామ వాంఛ తీర్చుకోలేదన్న శ్రీ వర్షిణి