
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):-గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా ప్రజలు సతమతమైన, ధరణి చెర ఉన్న సమస్యలు, నేడు భూ భారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ప్రజల సమస్యలు తీరేలా ప్రభుత్వం భూ భారతిని తీసుకువచ్చిందని నిపుణులు అనుకొస్తున్నారు.. ఈ నేపథ్యంలో మర్రిగూడ మండలంలో ప్రభుత్వ అధికారులు చేపట్టిన భూభారతి అవగాహన సదస్సులో అధికారులతో పాటు, ఆయా పార్టీల నాయకులు వేదికలపై కూర్చోవటం, ప్రసంగించటంపై సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది.. వారి ప్రసంగాలతో ఆ మీటింగ్ మొత్తం పార్టీ మీటింగ్ మాదిరిగా మారిందంటున్నారు మండల వాసులు.. అధికారులు మాత్రమే కూర్చునే ఆ వేదికపై, పలు పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు ముందు వరుసలో కూర్చోవటంతో, పలు పార్టీ నాయకులు ఈ విధానాన్ని తప్పుబట్టారు.. గత ప్రభుత్వంలో నాయకులు చేసిన తీరును ఎన్నో సార్లు విమర్శించిన, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం వారి బాటలోనే నడవటంపై అనేక విమర్శలకు దారి తీస్తుంది.. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీలతో ఏర్పాటు చేసిన ఈ వేదికపై పలు పార్టీ నాయకుల హంగామా చర్చనీయాంశంగా మారింది.. ఈ వేదికలో రైతుల సమస్యలు, వారి సలహాలను సూచనలను విన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విని సత్వర న్యాయం కోసం, అధికారులను ఆదేశించారు.. ఒక్కొక్క సమస్యను నమోదు చేసుకొని రైతుల ప్రశ్నలకు, అధికారులు జవాబు ఇచ్చారు..అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పని చేస్తుందని, అవినీతి నిర్మూలన కోసం, సత్వర న్యాయం కోసమే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చామని, ఈ చట్టం రైతుల బాసటగా నిలుస్తుందని అన్నారు.. శివన్నగూడెం రిజర్వాయర్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుందని, వారికి రావలసిన ప్రతి ఒక్క లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని వేదిక నుండి హామీ ఇచ్చారు.
అంగన్వాడీ ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్… ప్రభుత్వ సంచలన నిర్ణయం.