జాతీయం

Parliament Sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు, ఆమోదం పొందిన కీలక బిల్లులు ఇవే!

డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. మొత్తం 15 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో కీలక బిల్లకులకు ఆమోదం లభించింది

Parliament Winter Sessions: వాడీ వేడీగా కొనసాగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. శుక్రవారం నాడు లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. డిసెంబర్ 1న సమావేశాలు మొదలుకాగా, 19 వరకు కొనసాగాయి. మొత్తం 15 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. సెషన్ అంతా వాడీ వేడిగా కొనసాగింది. సమావేశాల సందర్భంగా లోక్‌సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.

లోక్ సభ ఆమోదం తెలిపిన కీలక బిల్లులు

⦿ వీబీ జీ రామ్‌ జీ  బిల్లు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో  వీబీ జీ రామ్‌ జీ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

⦿ శాంతి బిల్లు

అణు ఇంధన రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. సస్టెయినబుల్‌ హార్నెసింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా(శాంతి) బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది.

⦿ బీమా సవరణ బిల్లు

బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచే బీమా సవరణ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ ఆమోదించింది.

⦿ మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(రెండవ సవరణ)బిల్లు 2025 కి లోక్ సభ ఆమోదం తెలిపింది.

⦿ సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2025

⦿ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025

⦿ సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు 2025

⦿ ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025

⦿ జన్ విశ్వాస్(నిబంధనల సవర) బిల్లు

⦿ దివాళా, దివాళా కోడ్ (సవరణ) బిల్లు

⦿ పారదర్శకంగా భూసేకరణ కోసం జాతీయ రహదారుల(సవరణ) బిల్లు

⦿ కంపెనీల చట్టం సవరించడానికి కార్పొరేట్ చట్టలు(సవరణ) బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button