Parlaiament Budgess Session-2026: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన డేట్ ఫిక్స్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. జనవరి 28న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
రెండు విడతలుగాబడ్జెట్ సమావేశాలు
ఈ బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదట విడత ఫిబ్రవరి 13 వరకూ జరుగుతుంది. అనంతరం పార్లమెంటు వాయిదా పడుతుంది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభమైన ఏప్రిల్ 2 వరకూ జరుగుతాయి.
ఫిబ్రవరి 1న సభ ముందుకు బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజైన జనవరి 28న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు.
ప్రీ బడ్జెట్ సంప్రదింపులు ప్రారంభం
అటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న రీత్యా 13వ ప్రీ బడ్జెట్ సంప్రదింపులను నిర్మలా సీతారామన్ నిర్వహించినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సంబంధిత శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్ హాజరయ్యారు. ఆర్థిక విధానాల పటిష్టత, సమ్మిళత అభివృద్ధి, మహిళా సాధికారత, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్స్ తదతర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.





