
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, సింగరాయ మండలంలో ఉన్నటువంటి పాకాల బీచ్ ఉగ్రరూపం దాల్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి పాకాల బీచ్ లో అలలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లాలోని అధికారులు చొరవ తీసుకొని భద్రత దృశ్య జాలర్ల చాపల వేటను శుక్రవారం నాడు నిలిపివేశారు. దీంతో పాకాల బీచ్కు వచ్చేటువంటి పర్యాటకులకు అన్ని విధాలుగా భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా సముద్రంలో అలలతాయకుడి అనేది అధికంగా ఉండడంతో ఎవరూ కూడా ఈతకు వెళ్ళకూడదని పలువురు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ పర్యాటకులకు సూచిస్తున్నారు. అలాగే మరి కొంతమంది అధికారులు ఎవరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి మనుషులను ఈతకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాగా ప్రకాశం జిల్లాలో మరో రెండు రోజుల్లో తుఫాన్ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు వర్షాల దృశ్య.. మరోవైపు నదులు లేదా సముద్రాల వైపు ఎవరూ కూడా వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ కరెంటు స్తంభాల దగ్గర లేదా పెద్ద పెద్ద చెట్ల కింద ఉండకూడదని అధికారులు తెలియజేశారు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.