Saturday, March 21, 2026
Homeజాతీయంపహల్గామ్ లో మళ్లీ తెరుచుకున్న పర్యాటక ప్రాంతాలు, టూరిస్టులు వచ్చేనా?

పహల్గామ్ లో మళ్లీ తెరుచుకున్న పర్యాటక ప్రాంతాలు, టూరిస్టులు వచ్చేనా?

Pahalgam Parks Reopen: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్ లో మళ్లీ పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. మొత్త 16 పార్కులను ఓపెన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో పహల్గామ్ పార్క్ కూడా ఉన్నట్లు తెలిపారు. స్థానికులతో పాటు పర్యాటకుల కోసం ఈ పార్కులను ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. ఈ పార్కుల దగ్గర భద్రత  భారీగా పెంచినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో కీలక నిర్ణయం

జులై 3 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. పహల్గామ్ మీదుగా భక్తులు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటక ప్రదేశాలను అందుబాటులో ఉంచాని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా పార్కులను ఓపెన్ చేశారు. జమ్మూ ప్రాంతంతో పాటు కాశ్మీర్ లోయలోని పలు పార్కులను ఓపెన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.  మిగిలిన పార్కులను కూడా దశలవారీగా  ఓపెన్ చేస్తామని ఎల్జీ సిన్హా తెలిపారు. 50 రోజుల తర్వాత పార్కులను ఓపెన్ చేయడం పట్ల స్థానికులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి

ఏప్రిల్ 22న అనంతనాగ్ జిల్లా పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది చనిపోయారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ పాత్ర ఉందని భావించిన భారత్, సింధూ జలాలను నిలిపివేయడంతో పాటు ఆ దేశంతో అన్ని సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అటు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ చేసిన ప్రతి దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.

Read Also: ఆ మార్గాలన్నీ నో ప్లైయింగ్ జోన్ లోకి.. అమర్ నాథ్ యాత్రకు భద్రత్త కట్టుదిట్టం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments