తెలంగాణ

ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవనానికి సీఎం శంకుస్థాపన..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మ‌రో కొత్త శ‌కం ప్రారంభమైంది. వందేళ్లుగా తెలంగాణతో పాటుగా ఉమ్మడి ఏపీ, పొరుగ రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రాల ప్రజలకు సేవ‌లందించిన ఉస్మానియా హాస్పిటల్ నూత‌న భ‌వ‌న నిర్మాణానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ గోషామహల్‌ పోలీస్ గ్రౌండ్స్‌లో కొత్తగా నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు.

Also Read : ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

భవన నిర్మాణంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా, గోషామహల్ స్టేడియంలో నిర్మిస్తున్న కొత్త ఆసుపత్రి భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. మొత్తం 32 లక్షల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో 2 వేల ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యంతో కొత్త ఆసుప‌త్రిని నిర్మించ‌నున్నారు. 2700 కోట్ల వ్యయంతో దాదాపు 26 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించ‌నున్న ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుప‌త్రుల‌ను త‌ల‌ద‌న్నేలా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాబోయే వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఉస్మానియా హాస్పిటల్ నిర్మించాల‌ని చెప్పారు. అందుకు అనుగుణంగా.. అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, లేటెస్ట్ ఐసీయూ వార్డులు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్‌ సేవలు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.

Read Also : ఊపిరితిత్తుల సమస్యలతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి?

ఇక హాస్పిటల్ అండ‌ర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలోనూ పార్కింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు. హాస్పిటల్ స‌మీపంలో ఫైర్ స్టేష‌న్‌, హాస్పిటల్ చుట్టూ విశాల‌మైన ర‌హ‌దారులు, ఆసుప‌త్రి ప్రాంగంణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు సులభంగా చేరుకునేలా విశాలమైన మార్గాలు, దివ్యాంగులు హాస్పిటల్‌కి రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ప్రత్యేకమైన ర్యాంప్‌లు, రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చే వారు సేద తీరేందుకు అత్యాధునిక డార్మెట‌రీలు, క్యాంటీన్‌, వాష్ రూములు వంటివి ఏర్పాటు చేయనున్నారు. వీలైనంత తొందరగా.. రానున్న ఎన్నికల్లోపు ఆసుపత్రిని నిర్మించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. మా నాన్న కేసు విచారణలో ఎందుకు అంత ఆలస్యం?
  2. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ సన్నాహక సమావేశం.. ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా!!
  3. సేవా స్ఫూర్తిని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్
  4. హైదరాబాద్‌ శివారులో పోలీసుల కాల్పులు.. నలుగురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్
  5. 2 గంటలు నిలిచిపోయిన మెట్రో.. హైదరాబాదీలు ఆగమాగం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button