లాస్ ఏంజెల్స్‌లోని డాల్ఫీ థియేటర్లో అవార్డుల ప్రధానం
15న సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం
లాస్ ఏంజిల్స్, క్రైమ్ మిర్రర్: తన కెరీర్ లో ఒక్కసారైన అస్కార్కు ఎంపిక కావాలని ప్రతి ఒక్కరు కళలు కంటుంటారు. ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అతి పెద్ద వేడుక ’ఆస్కార్స్ 2026, 98వ అకాడమీఅవార్డ్స్ కు సర్వం సిద్ధమైంది. 2025లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందించేందుకు లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
అగశ్రేణి హాలీవుడ్ తారలు, ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతలు ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఈ ఏడాది ఆస్కార్ వేదికపై భారతీయ నటి ప్రియాంక చోప్రా కూడా ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్, అన్నే హాత్వే, గ్వినేత్ పాలిట్ర, పాల్ మెస్కల్ వంటి ప్రముఖ స్టార్స్‌తో కలసి ఆమె వేదికపై అవార్డులను ప్రదానం చేయనున్నారు.
98వ అకాడమీ అవార్డ్స్ ఈనెల 15న ఆదివారం అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు లాస్ ఏంజెల్స్‌లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరగనున్నాయి. తారల తళుకులతో రెడ్ కార్పెట్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అవార్డుల ప్రదానోత్సవం మొదలవుతుంది.
ప్రముఖ హాస్యనటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత కోనన్ ఓబ్రియన్ వరుసగా రెండో ఏడాది కూడా ఈ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. భారతీయ ప్రేక్షకులు ఆస్కార్స్ వేడుకలను డిజిటల్, టెలివిజన్ ప్లాట్‌ఫామ్‌లలో వీక్షించవచ్చు. స్టార్ మూవీస్‌లో ఉదయం 4:30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
