Operation Sindoor: లోక్ సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై కీలక చర్యల జరిగింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో చర్చను ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం శక్తి సమార్థ్యాలకు నిదర్శనమని రాజ్ నాథ్ కొనియాడారు. ఆత్మరక్షణ కోసమే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పిన ఆయన, ఎవరై భారత్ ఊరికే దాడి చేయదన్నారు.
22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి
ఇక ఆపరేషన్ సిందూర్ ను కేవలం 22 నిమిషాల్లో పూర్తి చేసినట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. పాక్ పౌరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా ఈ దాడులు చేసినట్లు వివరించారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు రాజ్ నాథ్ తెలిపారు. “ పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ఆత్మరక్షణమే కోసమే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. ఈ ఆపరేషన్‌తో అద్భుతమైన ఫలితాలను సాధించాం. ఉగ్రవాదులను అంతం చేయాలన్న లక్ష్యంతో భారత్ పని చేస్తుంది. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు నివాళి అర్పిస్తున్నాను” అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
ఎవరి ఒత్తిడితోనో ఆపరేషన్ ఆపేయలేదు!
అటు ఆపరేషన్ సిందూర్ పై ఎలాంటి ఒత్తిడి రాలేదుని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత సైనిక స్థావరాలపై దాడికి పాక్ యత్నించినట్లు చెప్పిన ఆయన.. పాక్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. భారత్ ముందుగా నిర్ణయించిన సైనిక లక్ష్యాలను సాధించిన తర్వాత దాడులను ఆపిందని రాజ్ నాథ్ ప్రకటించారు. ఎవరి ఒత్తిడితోనో ఆపరేషన్ ఆపేయలేదన్నారు. పాక్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం భారత్ లక్ష్యం కాదన్న ఆయన, ఉగ్ర స్థావరాలను లేకుండా చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాతే ఆపరేషన్ సిందూర్ ను ముగించినట్లు తెలిపారు.
Read Also: అశ్లీల కంటెంట్ పై కేంద్రం ఉక్కుపాదం, 25 ఓటీటీ యాప్ లు బ్యాన్!





