జాతీయం

నేటి తరంలో 100 అమ్మాయిల్లో నలుగురు మాత్రమే పవిత్రంగా ఉన్నారు: ప్రేమానంద్ మహారాజ్

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- నేటి తరంలో దేశవ్యాప్తంగా అమ్మాయిలు ఎలా మారిపోయారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు చాలా మారిపోయారని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అయితే ఇలాంటి తరుణంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ అనే స్వామీజీ నేటి సమాజంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు?.. అబ్బాయిలు ఎలా ఉన్నారో?.. అనే దానిపై మాట్లాడారు. అయితే ఈ ప్రేమానంద్ మహారాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా వివాదాస్పదంగా మారిపోయాయి. ఇంతకీ ఈ ప్రేమానంద్ మహారాజు ఏమన్నారు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భక్తులతో కిటకిటలాడిన శ్రీ సూర్య గిరి ఎల్లమ్మ ఆలయం
ఉత్తరప్రదేశ్లోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ స్వామీజీ ప్రతి ఒక్కరికి సుపరిచితులే. అయితే నేడు అతను మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి. ” ఈ రోజుల్లో ప్రతి వందమంది అమ్మాయిల్లో కేవలం ఇద్దరూ లేదా నలుగురు మాత్రమే చాలా పవిత్రంగా ఉన్నారని… మిగిలిన వారు బాయ్ ఫ్రెండ్ అంటూ ఇష్టానుసారంగా బిజీ జీవితాన్ని గడుపుతున్నారు” అని అన్నారు. అలాగే ప్రతి వందమంది అబ్బాయిల్లో కేవలం నలుగురు మాత్రమే పవిత్రంగా ఉన్నారని అబ్బాయిలను ఉద్దేశించి అన్నారు. అలాంటప్పుడు ఒక ఇంటికి నలుగురు అబ్బాయిలను కలిసి తిరిగే అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుంది?.. అలాగే నలుగురు అమ్మాయిలను కలిసిన అబ్బాయి.. మంచి భర్త ఎలా కాగలడు?.. అని ప్రేమానంద్ మహారాజ్ స్వామీజీ ప్రశ్నించారు. దీంతో సోషల్ మీడియా అంతటా కూడా ఈ స్వామీజీ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ‘చిన్నారి మృతి’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button