క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : బెంగళూరులో ఘోర విషాదం చోటు చేసుకుంది. తను పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది అనే బాధతో ఆ పెంపుడు కుక్క మెడలోని చైన్ తోనే యజమాని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా బెంగళూరులో వెలుగు చూసింది. ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా షాకు కు గురయ్యారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలం క్రితం జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కను కొనుగోలు చేశారు. దానికి ఎంతో చక్కగా బౌన్సీ అని పేరు పెట్టి చాలా ముద్దుగా పెంచుకుంటున్నారు. తాజాగా మంగళవారం ఉదయం అనారోగ్యం కారణంతో ఆ కుక్క మరణించడం జరిగింది. దీంతో ఆ కుక్క యజమాని రాజశేఖర్ అనే వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆ కుక్కను ఖననం చేసి ఇంటికి వచ్చిన మరుక్షణం కుక్కకి ఉపయోగించేటువంటి చైన్ ను తీసుకొని ఉరివేసుకొని చనిపోయాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. పెంపుడు జంతువులపై ఉన్నటువంటి ప్రేమను మనం ఈ మనిషి ద్వారా నేర్చుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఒక పెంపుడు జంతువు కోసం మరణించడం ఏంటని చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :