
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- నేడు కృష్ణాష్టమి సందర్భంగా మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో ఓ చిన్న కథనం.. కృష్ణాష్టమి అనగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇష్టంతో కృష్ణుడికి పూజలు చేస్తూ ఉంటారు. అందులోనూ కృష్ణుడిని ఆరాధించే కొంతమంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈరోజు ఉపవాసాలు ఉంటూ స్వామివారిని తలుచుకుంటూ తమ కోరికలను తీర్చమంటూ అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. అసలు ఈ కృష్ణాష్టమి రోజు ఎలా పూజలు చేయాలో, స్వామి వారి అనుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also : ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ ధరలు పెరిగాయ్, కొనాలంటే ఇక చుక్కలే!
మొదటగా తెల్లవారుజామునే లేచి చల్లనీటితో స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత చిన్ని కృష్ణుడి యొక్క విగ్రహం లేదా చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకోవాలి. చిన్నికృష్ణుడికి ఆహ్వానం పలుకుతూ వరి పిండితో కృష్ణుడి పాదముద్రలు వేసుకోవాలి. శ్రీకృష్ణుడికి కొన్ని వంటకాలు అంటే అమితమైన ప్రేమ. అందులో మరి ముఖ్యంగా వెన్న, అటుకులు, నెయ్యి, లడ్డూలతో పాటుగా కలకండ కూడా అంటే చాలా ఇష్టం కాబట్టి వీటన్నిటిని కూడా శ్రీకృష్ణుడికి ప్రసాదంగా సమర్పించాలి. ఈరోజు ఎవరైతే భక్తులు ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని… పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది అని వేద పండితులు చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు కృష్ణుడి అనుగ్రహం కలగాలంటే ఎంతో భక్తితో ఉపవాసం, పూజలు చేయాల్సి ఉంటుంది.
Read also : మోడీ స్పీచ్ తో.. ప్రతి ఒక్కరి గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపింది