క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: పెన్షన్ కోసం వెళుతూ కారు ప్రమాదానికి గురై ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం క్రాస్ రోడ్ అద్దంకి నార్కట్పల్లి రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది.. కుటుంబ సభ్యులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా..
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన అక్కనపల్లి బజరయ్య(67) అనే వ్యక్తి వేములపల్లి మండల కేంద్రంలో పెన్షన్ కోసం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరారన్నారు.
ఈ క్రమంలో సుమారు ఒంటిగంట ప్రాంతంలో మండలం పరిధిలోని శెట్టిపాలెం క్రాస్ రోడ్ అద్దంకి నార్కట్పల్లి రహదారినీ దాటుతుండగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఒక కారు అతివేగంగా వచ్చి అతనిని ఢీకొట్టడంతో బజరయ్య ఎగిరి రోడ్డు పక్కన పడిపోయారన్నారు.
ఈప్రమాదంలో తలకు,కళ్ళకు త్రివ్ర గాయాలయి రక్తస్రావం అవడంతో స్థానికులు గమనించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరీక్షించిన వైద్యులు అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు అన్నారు..
Also Read:బిగ్ బ్రేకింగ్ న్యూస్.. చేపల లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం.. ఆరుగురు మృతి!
Also Read:చివరి ఓటు పడేవరకు అప్రమత్తంగా ఉండాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి





