సినిమా

రేపు అన్ని థియేటర్లలో OG నే.. రేపు మిరాయ్ సినిమాకు హాలిడే?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రేపు దేశవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి OG సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే సినిమా ప్రేక్షకులు చాలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ ఓజీ సినిమాపై హైప్ మాత్రం అసలు తగ్గట్లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం, యాటిట్యూడ్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది. అలాగే తమన్ ఈ సినిమాకు అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ “OG” పేరే వినిపిస్తుంది.

Read also : OG అంటే ఒంటరిగా గెలవలేడనా?.. : ప్రకాశం ఎమ్మెల్యే

తాజాగా ఈ సినిమాకి మరొక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. గత రెండు వారాల నుంచి థియేటర్లలో యువ హీరో తేజ సజ్జ నటించిన మీరాయ్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 140 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే మిరాయ్ మూవీ మేకర్స్ అలాగే టీజీ విశ్వప్రసాద్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు మీరాయ్ ఆడుతున్నటువంటి అన్ని థియేటర్లు కూడా OG కీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి అభిమానంతోనే రేపు ఒక్కరోజు మా సినిమా ఆడుతున్న అన్ని థియేటర్లలో కూడా ఓజి సినిమానే ఆడుతుందని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా మిరాయ్ చిత్ర బృందానికి, మూవీ మేకర్స్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో రేపు మొత్తం ఓజి పేరే వినిపించేలా ఉంది. ఈ సినిమా రేపు భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఫ్రీ బుకింగ్ టికెట్స్ లక్షల్లో, వేలల్లో అమ్ముడుపోతున్నాయి. దీంతో రేపు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల గెలుపు కోసం బీఆర్ఎస్ సన్నద్ధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button