తెలంగాణ

నాగార్జునసాగర్ 14 గేట్లు ఎత్తిన అధికారులు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈమధ్య శ్రీశైలం లో నీటిని విడుదల చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు కూడా ఎత్తడం జరిగింది. నాగార్జునసాగర్ కు పైనుంచి భారీగా వరద పెరగడంతో అధికారులు ఇవాళ గేట్లను ఎత్తారు. తెలంగాణ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అలాగే అట్లూరి లక్ష్మణ్ వీరిద్దరూ అధికారులతో పాటు కలిసి గేట్లను ఎత్తారు. ఇవాళ మొదటగా రెండు గేట్ల ద్వారా నీటిని కిందకు విడుదల చేయగా… ప్రస్తుతం 14 గేట్ల ద్వారా నీటిని కిందకు సరఫరా చేస్తున్నారు. కాగా దాదాపు 18 సంవత్సరాల తరువాత జులై నెలలోనే గేట్లు ఎత్తడం అనేది ఇదే తొలిసారి కావడం విశేషం.
ఎయిర్ పోర్టులో మంత్రుల రుసరుసలు, అలిగిపోయిన కోమటిరెడ్డి!
అప్పుడెప్పుడూ 2007వ సంవత్సరంలో జూలై నెలలోనే ఇన్ని గేట్ల ద్వారా నీటిని కిందకి విడుదల చేశారు. మళ్లీ దాదాపు ఇన్నేళ్ల తర్వాత జులై నెలలోనే ఇంత తొందరగా నీటిని వదలడం అనేది ఇదే మొదటిసారి కావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఆగస్టు తర్వాత గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఒక నెల ముందుగానే నీటిని విడుదల చేయాల్సి వస్తుంది. కాగా ఈ సంవత్సరం ఇప్పటికే శ్రీశైలం డ్యాం రెండుసార్లు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇక శ్రీశైలంలో వరద బారిగా పెరగడంతో… ఆ విడుదలైన నీరు ద్వారా నేడు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా నిండడంతో నేడు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది కూడా సాగుకు నీరు అందుతుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వర్షం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలకు వచ్చే VIP లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకయ్య నాయుడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button