మహబూబ్‌నగర్, క్రైమ్ మిర్రర్: పేదలకు సరఫరా చేయాల్సిన అక్రమ రేషన్ స రఫరా పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రేషన్ బియ్యంపై సరఫరాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తాజాగా మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లిలో జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.. పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టారు. ఓ బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. వాహనాన్ని ఆపి పరిశీలించగా, అందులో 35 క్వింటాళ్లకు పైగా బియ్యం నిల్వలు ఉన్నట్లు బయటపడింది.
అక్రమ రవాణాకు చెక్..
ఈ బియ్యం ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకుగా అనుమానిస్తున్నారు. అయితే దానిని అక్రమంగా సేకరించి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న ముఠా గురించి విచారణ కొనసాగుతోంది.
పలువురిపై కేసులు నమోదు…
రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న పోలీసులు వెంటనే బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అక్రమ రేషన్ సరఫరా వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించడం వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకులు లబ్ధిదారులకు చేరకుండా మళ్లించడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు.
