క్రైమ్

విద్యార్థినిపై అధ్యాపకుల గ్యాంగ్ రేప్, బీఈడీ స్టూడెంట్ ఆత్మాహుతి!

తల్లిదండ్రుల తర్వాత అంత గౌరవంగా చూసే గురువులు దిగజారి ప్రర్తిస్తున్నారు. సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన  వాళ్లే వంకర చూపులు చూస్తున్నారు. ప్రొఫెసర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ బీఈడీ విద్యార్థిని ఆత్మాహుతి చేసుకోగా, మరోచోట ఓ విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రొఫెసర్ వేధింపులు తట్టుకోలేక  బీఈడీ విద్యార్థి ఆత్మాహుతి

ఒడిషా బాలాసోర్ లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ప్రొఫెసర్ వేధింపులు తట్టుకోలేక, బీఈడీ సెకెండ్ ఇయర్ విద్యార్థిని కాలేజీ క్యాంపస్ లోనే ఆత్మాహుతి  చేసుకుంది. ప్రొఫెసర్ సమీరా కుమార్‌ సాహు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. అయినా, సదరు ప్రొఫెసర్ పై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె క్యాంపస్ లోనే ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన యూజీసీ.. విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. నివేదిక తర్వాత బాధ్యులపై కటిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.

విద్యార్థినిపై లెక్చరర్ల సామూహిక అత్యాచారం

అటు ఓ విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్లు, వారి ఫ్రెండ్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన బ్లాక్ మెయిల్ కు పాల్పడిని ఘటన కర్నాటకలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా మూడబిదరెలో ఈ దారుణం ఘటన జరిగింది. బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో నిందితులపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఓ కాలేజీకి చెందిన భౌతికశాస్త్రం లెక్చరర్‌ నరేంద్ర, జీవిశాస్త్రం లెక్చరర్‌ సందీప్ తో పాటు వారి ఫ్రెండ్ అనూప్ ను పోలీసులు అరెస్టు చేశారు.  ఫిజిక్స్‌ లెక్చరర్‌ నరేంద్ర బాధిత విద్యార్థినికి నోట్స్‌ ఇచ్చే విషయంలో సహకరించాడు. ఈ క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత విద్యార్థినిని తన మిత్రుడు అనూప్‌ గదికి తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత బయాలజీ లెక్చరర్‌ సందీప్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె వ్యతిరేకించడంతో నరేంద్రతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరించాడు. ఆ తర్వాత బాధితురాలిని అనూప్‌ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల అనూప్ కూడా ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ముగ్గురి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పేరెంట్స్ కు విషయం చెప్పి, మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్‌ సూచనతో  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: భార్యాభర్తల వివాదంలో రక్తపాతం..!, ఇద్దరి దారుణహత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button