
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. నాలుగు,ఐదు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యేకు వచ్చిన న్యూడ్ కాల్స్ పైనే వార్తలు చాలా వచ్చాయి. దీంతో వెంటనే మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే వేముల వీరేశం జరిగిందంతా కూడా మీడియాకు వివరించారు. దీంతో అన్ని సోషల్ మీడియాలలో కూడా అతను చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. అయితే న్యూడ్ కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను డబ్బులు డిమాండ్ చేశారు. అయితే వీటికి భయపడిపోయి నేరగాళ్లకు డబ్బులు ఇవ్వకుండా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వేముల వీరేశం.
ఇంటర్ పరీక్షలో ప్రశ్నపై పొలిటికల్ ఫైట్ – ఇంతకీ ఏంటా క్వశ్చన్..? ఏం అడిగారు..?
ఇక ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాలను మధ్యప్రదేశ్ కి చెందిన వారిగా గుర్తించి వివరాలను వెల్లడించారు. అక్కడివారిని అరెస్టు చేసిన పోలీసులు నకిరేకల్ తీసుకువచ్చినట్లుగా తాజాగా పోలీసులు వెల్లడించడం జరిగింది. కాగా గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నోసార్లు జరిగాయి. చాలామంది నేరగాళ్లు ఈ సంఘటనల కారణంగా అరెస్టయి ప్రస్తుతం జైలులో చిప్పకూడు తింటున్నారు. అయినా కూడా చాలా మంది సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతిలో మరెన్నో వింతలు చేసి అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తెలిసి తెలియని అమాయకులు ఈ వలలో పడితే డబ్బులను డిమాండ్ చేయడం.. లేదంటే చంపేస్తామని బెదిరించడం లాంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాటిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.