
-
దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
-
ఓయూలో ఎన్‌ఎస్‌యూఐ నేత దిష్టిబొమ్మ దహనం
-
ఒడిశా అత్యాచార ఘటనపై ఏబీవీపీ నిరసన
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ఒడిశాలో చోటుచేసుకున్న అత్యాచార ఘటన హైదరాబాద్‌లోని విద్యార్థి వర్గాల్లో తీవ్ర స్పందనను రేపుతోంది. భువనేశ్వర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఎన్‌ఎస్‌యూఐ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉదిత్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థినిపై అత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు చేపట్టారు.
ఆర్ట్స్ కాలేజ్ ఎదుట దిష్టిబొమ్మ దహనం
ఒడిశా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎన్‌ఎస్‌యూఐ నేత ఉదిత్ ప్రధాన్ దిష్టిబొమ్మను ఏబీవీపీ కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నిందితుడిని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించడమంటే ఆ సంఘంలోని మహిళలను కించపరచడమేనని నినదించారు. ఓ విద్యార్థి సంఘంలోని కీలక నాయకుడే ఇలాంటి నేరానికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎన్‌ఎస్‌యూఐ తక్షణమే బాధ్యత తీసుకుని బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: