
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా బాధితులేనా..? కుల్వకుంట్ల ఫ్యామిలీలో నలుగురికి నోటీసులు వచ్చాయా..? కవిత ఎవరిని ఉద్దేశించి ఈ ఆరోపణలు చేశారు..? ఆ నలుగురి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయా…? ఇంతకీ ఎవరా నలుగురు?… తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు… కొంతకాలంగా చడీచప్పుడు లేకుండా ఉంది. కీలక సూత్రధారిగా చెప్తున్న ప్రభాకర్‌రావు విచారణతో… ఆ కేసులో అప్‌డేట్స్ లేవు. అయితే… ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత చేసిన ఆరోపణలతో ఈ కేసులో మళ్లీ వేడి పెరిగింది. హరీష్‌రావు, సంతోష్‌రావు , శ్రవణ్‌రావు , కలిసి.. ఫోన్ ట్యాపింగ్ చేయించారని కవిత ఆరోపించారు. అంతేకాదు… తమ కుటుంబంలోని నలుగురి ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పారామె. ఆ నలుగురికి సిట్ అధికారులు అధికారుల నుంచి నోటీసులు కూడా వచ్చినట్టు చెప్పారు కవిత. అయితే… కవిత పీఏకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ… ఆయన విచారణకు వెళ్లలేదు. పీఏ కుటుంబ సభ్యుడు కాదు కదా. మరి ఎవరా నలుగురు..? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రశ్నలపైనే చర్చ జరుగుతోంది.
Read also : మన దేశంలో అత్యంత ధనిక మంత్రి ఎవరో తెలుసా?.. టాప్ 10 మంత్రులు వీరే!
కవితతోపాటు ఆమె భర్త అనిల్, మరో ఇద్దరు కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. అది నిజమేనా…? కవిత ఆ విషయాన్ని మళ్లీ మీడియా ముందుకు తెచ్చారా. తమ కుటుంబంలోని నలుగురికి నోటీసులు వచ్చాయని చెప్పారటే.. కవితతోపాటు ఆమె భర్త, మరో ఇద్దరు కటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న వార్తలు నిజమేనా..? అన్న చర్చ జరుగుతోంది. ఇక.. ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సంబంధించిన వారు కూడా బాధితులే అని కూడా కవిత చెప్పారు. అంటే… కేటీఆర్, కవితకు దగ్గరగా ఉన్న సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేయించారా…? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తంగా… ఆ నలుగురు అంటూ కవిత పేల్చిన బాంబ్… ఇంకా పేలుతూనే ఉంది.
Read also : కొత్త జిల్లాలపై సరికొత్త డిమాండ్లు.. ఈనెల 15లోపు నివేదిక!