
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు..395 ఎకరాలు వున్న మునుగోడు పెద్ద చెరువు ఆక్రమణకు గురైందని తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులతో,మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు..రెవెన్యూ మ్యాప్ ను పరిశీలించి ,రికార్డుల ప్రకారం చేపట్టాల్సిన పనులను అధికారులకు సూచించారు..చెరువు భూమిని మొత్తం సర్వే చేసి,కబ్జా చేసిన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు..చెరువు హద్దులు వెంటనే నాటాలని సూచించారు..చెరువు భూమి కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు..చెరువు భూమి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు..ఇంచార్జీ తహశీల్దార్ నరేష్,ఇంచార్జీ ఎంపిడిఓ విజయభాస్కర్, నీటి పారుదల శాఖ డీ ఈ ప్రేమ్ కుమార్, సర్వేర్ నాగేశ్వరావు పాల్గొన్నారు.
Read also : నీలకంఠ రామస్వామి రక్షణకు శాశ్వత రోడ్డు, బ్రిడ్జ్ నిర్మాణానికి హామీ – ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Read also : క్రేజీ న్యూస్… కాంతార 3 లో రిషబ్ శెట్టితో పాటు ఎన్టీఆర్?