
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్:- మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ తరపున 35వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మాసరి కళ్యాణ్ (బీకాం,బీపీఈడీ) శుక్రవారం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ అండ్ జేఏసీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జ్ తరి యల్లయ్య, మిర్యాలగూడ మండల అధ్యక్షులు నూకపంగా నవీన్, వేములపల్లి మండల అధ్యక్షులు ఇంద్రపల్లి శివకుమార్ పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అలాగే వివిధ మండలాల నాయకులు శివ నాయక్, లక్ష్మణ్, బంటు నాగయ్య గౌడ్, మహేష్, అరుణ్, మల్లికార్జున్, రామ్ కుమార్, దేవేందర్‌తో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ..జేఏసీ జిల్లా నాయకులు వజ్జగిరి అంజయ్య, నీలకంఠం నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధర్మ సమాజ్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల మద్దతుతో 35వ వార్డులో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read also : గ్రామపంచాయతీ నిధులతో ఐమాక్స్ లైట్లు బిగింపు
Read also : క్యాతనపల్లిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. 22 వార్డులకు 241 నామినేషన్లు





