Saturday, March 28, 2026
Homeజాతీయంశత్రువును మోకాళ్లపై కూర్చోబెట్టాం, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!

శత్రువును మోకాళ్లపై కూర్చోబెట్టాం, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!

PM Narendra Modi: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రధాని మోడీ మరోసారి గుర్తు చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడంలో భారత్ ముందుంటుందన్నారు. ఉగ్రవాదంపై ఎంత కఠినంగా ఉంటామో ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించిందన్నారు. భారత్ పై ఉగ్రదాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. భారత్ మీద దాడి చేసి, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా అంతం చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రయోజనాలను కాపాడే విషయంలో తమ ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గబోదన్నారు.

Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది, ట్రంప్ కీలక ప్రకటన!

శత్రువును మోకాళ్ల మీద కూర్చోబెట్టాం!

తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం విషయంలో భారత విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు “భారత్‌ పై ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. మా దేశం మీద దాడులకు పాల్పడిన ముష్కరులు ఎక్కడ నక్కినా వదిలిపెట్టేది లేదు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధ వాతావరణంలో స్వదేశీ ఆయుధాలు తమ ప్రభావాన్ని చూపించాయి. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను సాధించాం. సైనిక అవసరాల కోసం విదేశాలపై మనం ఇప్పుడు తక్కువగా ఆధారపడుతున్నాం. ఆపరేషన్ సిందూర్ విషయంలో ఈ విషయం తేటతెల్లం అయ్యింది. దేశీయంగా తయారైన ఆయుధాలతో కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ ను మన సైన్యం మోకాళ్ల మీద కూర్చోబెట్టింది. భారతీయుల రక్తాన్ని పారించిన ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడా సురక్షితంగా ఉండలేవని నిరూపించింది” అని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.

Read Also: కాల్పుల విరమణకు ఓకే.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక ప్రకటన!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments