
క్రైమ్ మిర్రర్,సినిమా:- టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ‘దండోరా’ చిత్రంతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు మురళీ కాంత్ దేవాసొత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 4వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ విభిన్నమైన లవ్ స్టోరీ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. షూటింగ్ పనులు వేగంగా పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది. అలాగే ప్రమోషన్స్‌లో భాగంగా అతి త్వరలోనే ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి జోమోన్ టి. జాన్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ సరసన కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ఈ డిఫరెంట్ ప్రేమకథలో హీరోయిన్ ఎవరై ఉంటారనే దానిపై సినీ ప్రియుల్లో, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. డిసెంబర్ 4న రాబోతున్న ఈ సినిమాతో నితిన్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.
సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ హీరోగా అరంగేట్రం…? లైకా ప్రొడక్షన్ తో చర్చలు…