అంతర్జాతీయంక్రీడలు

హాఫ్ సెంచరీకి పుష్ప!… సెంచరీకి ఇంటర్నేషనల్ పుష్ప?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా మరియు టీమిండియా నాలుగో టెస్ట్ ఆడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపైన మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాను కంగారు పెట్టి మరి సెంచరీ చేశాడు. అతి చిన్న వయసులోనే ఆస్ట్రేలియా గడ్డపై అది కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో సెంచరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏమాత్రం కంగారు పడకుండా మొదటి టెస్ట్ సిరీస్ లోనే అది కూడా ఆస్ట్రేలియా పై సెంచరీ చేయడంతో శభాష్ నితీష్ కుమార్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

హైడ్రా కూల్చివేతలు ఆగవు.. పెద్ద భవనాలపైనా కూల్తేస్తం!

ఆస్ట్రేలియా గడ్డమీద ఒక తెలుగోడు అది కూడా 23 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ బాధడం అనేది మామూలు విషయం కాదు. ఒకపక్క టీమిండియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఒడిదుడుకులతో తక్కువ పరుగులకే అవుట్ అవుతుండగా, గ్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఏకంగా 176 బంతులు అడిగి 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు మరియు ఒక సిక్స్ కూడా ఉంది. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసేటప్పుడు తన తండ్రి ముత్యాల్ రెడ్డి టెన్షన్ అంతా కాదు. తండ్రి ముత్యాల రెడ్డి తనకు తెలిసినటువంటి దేవుళ్ళందరినీ కూడా ప్రార్థించాడు. ఏది ఏమైనా సరే చివరికి తన ప్రార్ధనకి ఫలితం దక్కింది.

లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ డిప్యుటీ తహసీల్దార్

నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ చేసిన సందర్భంలో పుష్ప స్టైల్ లో తన బ్యాటుతో తగ్గేదేలే అంటూ ఫోజ్ ఇచ్చాడు. అలా చిన్నగా సెంచరీ చేసే సమయానికి ఎన్నో ఇబ్బందికర బంతులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా సునాయసంగా ఎక్కడ ఆడాలో అక్కడ మాత్రమే ఆడి చివరికి సెంచరీ సాధించాడు. సెంచరీ చేసిన మరుక్షణం ఆ సెంచరీని దేశానికి అంకితం చేశాడు. దీంతో నితీష్ అంటే నేషనల్ అనుకుంటిరా!.. కాదు… ఇంటర్నేషనల్ అంటూ ప్రతి ఒక్క ఇండియా అభిమాని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నితీష్ కుమార్ రెడ్డి గురించి చర్చించుకుంటున్నారు. ఇతను ఇలానే ఆడితే భవిష్యత్తులో టీమిండియాలో మంచి పొజిషన్లో ఉంటాడని అందరూ అంటున్నారు.

లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ డిప్యుటీ తహసీల్దార్

తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే రెండు రోజులు బీఆలర్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button