
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :-కొద్ది రోజుల క్రితం నిధి అగర్వాల్ కు KPHB ఏరియాలో ఉన్నటువంటి లులు మాల్ లో చేదు అనుభవం ఎదురైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ లులు మాలులో రాజా సాబ్ సినిమా సాంగ్ రిలీజ్ కోసం వచ్చిన నిధి అగర్వాల్ కు తిరిగి వెళుతున్న క్రమంలో అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదురుకోగా అతి కష్టం మీద ఆమెని బాడీగార్డ్స్ సేఫ్టీ గా తిరిగి పంపించారు. ఇక ఆ తరువాత శివాజీ ఈ విషయంపై పరోక్షంగా కామెంట్లు చేయగా ఈ విషయం తీవ్ర దుమారం రేపింది.
Read also : ఆ విషయం తెలియకనే ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు : డార్లింగ్ ప్రభాస్
అయితే ఇదే క్రమంలో తాజాగా రాజా సాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నిధి అగర్వాల్ అదే లుక్ లో ఈసారి భారీ సెక్యూరిటీతో హాజరయ్యారు. లులు మాల్ సంఘటన దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకమైన ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ సెక్యూరిటీ తోనే నేడు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు భాగంగా ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెల్లని చీర ధరించి ఆమె ప్రతి ఒక్కరిని కూడా మైమరిపించేలా ఉన్నారు. అయితే ఒకవైపు ఫ్యాన్స్ ఆమెను ఆ ఘటన జరిగిన తర్వాత కూడా ఇలాంటి దుస్తులు వేసుకొని రావడం అవసరమా అని అంటున్నారు.
Read also : జర్నలిస్టుల హక్కులను హరించే కొత్త జీవోను సవరించాలి





