క్రైమ్

Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ కేసు.. మరో నలుగురు నిందితుల అరెస్ట్!

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరో నలుగురు నిందితులను దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు.

ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను NIA అధికారులు అరెస్ట్ చేశారు.  శ్రీనగర్‌లో వీరిని అరెస్ట్ చేసింది. దీంతో ఈ దాడితో సంబంధం ఉన్న మొత్తం అరెస్టులు 6కి పెరిగాయి. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనపై  NIA ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నది. జిల్లా సెషన్స్ జడ్జి, పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన ఆర్డర్ల మేరకు నలుగురు నిందితులను జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

నలుగురిలో ముగ్గురు డాక్టర్లు

తాజాగా అరెస్ట్ అయిన నిందితులలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. నిందితులను  జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, అనంత్‌నాగ్‌కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, షోపియన్‌కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్,  లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ గా గుర్తించారు. వీరందరూ ఢిల్లీ బ్లాస్ట్ లో ముఖ్యమైన పాత్ర పోషించారని దర్యాప్తు ఏజెన్సీ వెల్లడించింది.  చెబుతోంది.

రీసెంట్ గా ఇద్దరు నిందితుల అరెస్ట్

ఇటీవల ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్టర్ అయి ఉన్న అమీర్ రషీద్ అలీని, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదికి సాంకేతిక సహాయం అందించిన డానిష్ అలియాస్ జాసిర్ బిలాల్ వాని లను NIA అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో పూర్తి కుట్రను వెలికితీసే ప్రయత్నాలలో భాగంగా వీరిద్దరినీ ఇంటరాగేట్ చేస్తోంది.

మేథో ఉగ్రవాదులతో అత్యంత ప్రమాదకరం

క్షేత్రస్థాయిలో పనిచేసే ఉగ్రవాదుల కంటే వారిని నడిపిస్తున్న మేథో ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లు, నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటనలు ఇందుకు నిదర్శమన్నారు.  ఢిల్లీ అల్లర్లు 2020కి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్ సహా పలువురి బెయిల్ పిటిషన్లను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. వైద్యులు, ఇంజినీర్లు కొందరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం కొత్త ట్రెండ్‌గా మారిందన్నారు. 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు ముందు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా.. ఇమామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వీడియోలను నిరసన సమయంలో చూపించారని తెలిపారు. ఏఎస్జీ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. ఈ కేసుపై ఇవాళ(శుక్రవారం) తదుపరి విచారణ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button