
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేడు తెలంగాణ రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ బడ్జెట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ” ఇందిర గిరిజన వికాసం” పేరిట ఒక నూతన స్కీమును అమలు చేయనున్నట్లు తెలిపింది. పౌడ భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సరఫరా అనేది చేయనుంది. పౌరుడు భూముల్లో అటవీ ఉత్పత్తులు మరియు తోటల పెంపకానికి ప్రోత్సాహం అనేది ఇవ్వనుంది. 2.1 లక్షల రైతులకు ఈ సౌకర్యం అనేది కల్పించనుంది. ఇక నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధికి ఏకంగా 12,600 కేటాయిస్తామని పేర్కొంది. దీనితో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నేడు ఆయా శాఖలకు సంబంధించి బడ్జెట్ ను కేటాయించింది. దాదాపుగా మూడు లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్వయానా శాసనసభలో తెలపడం జరిగింది. అన్ని రకాల శాఖలకు సంబంధించి కోట్ల రూపాయలను ప్రతిపాదించారు.
పీచేముడ్ అంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు – బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటున్న ఎమ్మెల్యే గూడెం
రేవంత్-భట్టి విక్రమార్కది సూపర్ జోడి… వైఎస్‌ఆర్-రోశయ్యలా..!