
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- హీరో నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాల నడుము మధ్య విడుదల అయ్యి ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. అలాగే ఈ మూవీ కలెక్షన్లలో కూడా రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై ఎనిమిది రోజుల్లోనే ఏకంగా 95 కోట్లు వసూలు రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లను రాబడుతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాకి చందు ఉండేటి డైరెక్టర్ గా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమన్నపేటలో దొంగల బీభత్సం.
ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం విడుదలైన రోజే ఇంటర్నెట్లో హెచ్డి క్వాలిటీతో ఈ సినిమాని లీక్ చేశారు. అయినా కానీ కలెక్షన్లలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంత సులభంగా 100 కోట్లు మార్పు దాడుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. ఏదేమైనా కానీ ఈ సినిమా పైరసీని ఎదుర్కున్న కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. తాజాగా బన్నీ వాసు కూడా ఈ లీక్ పై స్పందించారు. ఎవరైనా సరే ఈ చిత్రాన్ని ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకున్న కూడా కేసులను నమోదు చేస్తామని తెలిపారు.